america: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి

  • టెనస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లోలో ఘటన
  • ప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి
  • గత నెల 28న ఘటన
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. టెనస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలో ఈ దుర్ఘటన జరిగింది. గత నెల 28న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు స్టాన్లీ (23) కాగా, మరొక విద్యార్థిని వైభవ్ గోపిశెట్టి (26)గా గుర్తించారు. విద్యార్థులిద్దరూ టెనస్సీ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారును డేవిడ్ టోరెన్ అనే వ్యక్తి తన ట్రక్కుతో ఢీకొట్టాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైభవ్ గోపిశెట్టి తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతానికి చెందినవాడన్న విషయం తెలియాల్సి ఉంది.
america
Road Accident
telugu student

More Telugu News