Disha: వారిని గుడ్డిగా నమ్మడమే ఆమె చేసిన తప్పు: నటి రిచా చద్దా

  • స్కూటీ బాగు చేయించి ఇస్తానంటే నమ్మేసింది
  • దిశను ఓ ఆట వస్తువులా చూశారు
  • చూస్తుంటే అబ్బాయిల పెంపకంలోనే తేడా ఉన్నట్టు అనిపిస్తోంది
శంషాబాద్ దిశ హత్యాచార ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా స్పందించింది. తన స్కూటీని బాగు చేయించి ఇస్తానన్న వారిని గుడ్డిగా నమ్మేసిందని, ఆమె చేసిన తప్పు అదొక్కటేనని రిచా ఆవేదన వ్యక్తం చేసింది. తమను ఆమె నమ్మిందని, ఆమె పూర్తిగా తమ అధీనంలోకి వచ్చిందని నిర్ధారించుకున్నాకే ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపింది. దిశను ఓ మనిషిలా కాకుండా ఆట వస్తువులా చూశారని పేర్కొంది. తమను నమ్మిన ఆమెపై నిందితులు దారుణంగా అత్యాచారానికి తెగబడి, ఆపై హత్యకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ ఘటనలు చూస్తుంటే అబ్బాయిల పెంపకంలో తేడా ఉన్నట్టు అనిపిస్తోందని రిచా చద్దా ఆవేదన చెందింది.
Disha
shamshabad
Richa Chadda
Bollywood

More Telugu News