shamshabad: ఏమో సార్.. అప్పుడు ఫుల్లుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు: దిశ హత్యాచార నిందితులు

  • యువతి ఒంటరిగా కనిపించడంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయం
  • సోయి లేని స్థితిలోనే ఘాతుకం
  • చంపేసి కాల్చేస్తే విషయం మరుగున పడిపోతుందని భావన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాము ఆ సమయంలో పూర్తిగా మద్యం మత్తులో ఉన్నామని, ఏం చేస్తున్నామో సోయిలేని స్థితిలో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో నిందితులు వెల్లడించారు. ఉదయం నుంచి లారీలో కూర్చుని, కూర్చుని విసుగెత్తిపోయామన్నారు. ఆ సమయంలో దిశ కనిపించడంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నామని నిందితులు పేర్కొన్నారు.

ఆమె ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత సులభమవుతుందని భావించామని నిందితులు తెలిపారు. అత్యాచారం అనంతరం పారిపోవాలని అంతకుముందే నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఆమెను చంపేసి కాల్చేస్తే ఎవరికీ తెలియదని అనుకున్నామని, కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదని నిందితులు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.
shamshabad
Disha
accused
Police

More Telugu News