KCR: మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయి: సీఎం కేసీఆర్

  • శంషాబాద్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందన
  • దారుణమైన ఘటనగా పేర్కొన్న సీఎం
  • మహిళలకు రాత్రివేళ డ్యూటీలు వద్దని స్పష్టీకరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తన కార్యాలయంలో వారికి విందు ఇచ్చిన అనంతరం వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ ఘటనపై స్పందించారు. ఇది దారుణమైన, అమానుషమైన సంఘటన అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయని, రాత్రి సమయంలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దని అధికారులకు సూచించారు.

శంషాబాద్ సమీపంలో వెటర్నరీ వైద్యురాలు దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె అత్యాచారం చేసిన దుండుగులు ఆపై దహనం చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
KCR
TRS
Telangana
Hyderabad
Disha
TSRTC

More Telugu News