Chandrababu: రేపటి నుంచి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

  • జిల్లాల వారీగా పర్యటిస్తున్న చంద్రబాబు
  • ఇటీవలే కడప జిల్లాకు వెళ్లిన టీడీపీ అధినేత
  • కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే కడప జిల్లాలో పర్యటన ముగించుకున్న ఆయన తాజాగా కర్నూలు జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు రేపటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు.

తన పర్యటనలో భాగంగా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల నేతలతో వీజేఆర్ ఫంక్షన్ హాల్ లో సమావేశం అవుతారు. పార్టీ అధినేత పర్యటన ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, జిల్లా టీడీపీ చీఫ్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పరిశీలించారు.
Chandrababu
Kurnool District
Telugudesam

More Telugu News