Cricket: శంషాబాద్ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగులు

  • రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 
  • విచారణ చేపట్టిన పోలీసులు
  • కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలిని నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి, దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో కొందరు పోస్టింగ్ లు చేస్తున్నారు. ఈ విషయంపై కొందరు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలపై పోస్టింగ్ లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా, శంషాబాద్ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Cricket
Twitter
Facebook
Hyderabad

More Telugu News