Police: శంషాబాద్ ఘటన: పోలీసులను కాలనీ నుంచి బయటకు పంపేసిన స్థానికులు.. ఉద్రిక్త పరిస్థితులు

షార్ట్స్‌లో చూడండి
వెటర్నరీ వైద్యురాలి హత్యాచార ఘటనపై రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నక్షత్ర విల్లా వద్ద కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ కాలనీలోనే ఆమె కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. కాలనీ గేటుకు లోపలి నుంచి తాళాలు వేసిన కాలనీ వాసులు తమ ప్రాంతానికి పోలీసులు, రాజకీయ నాయకులు రావద్దని బోర్డులు పెట్టేశారు.

అలాగే, తమ కాలనీలో ఉన్న పోలీసులను బయటకు పంపేశారు. గేటు వద్దే బైఠాయించి స్థానికులను మాత్రమే లోపలికి పంపుతున్నారు. కాలనీ వాసుల డిమాండ్ తో అక్కడ ఉన్న పోలీసులు, కొందరు నాయకులు వెనక్కి వెళ్లిపోయారు. కొందరు సీపీఎం నేతలు ఈ రోజు ఉదయం అక్కడకు వచ్చి, స్థానికులతో పాటే కూర్చొని నిరసనలో పాల్గొన్నారు. ఆ కుటుంబానికి సానుభూతి వద్దని, వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Police
Telangana
Hyderabad

More Telugu News