Maharashtra: ఫడ్నవీస్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఎద్దేవా

  • ప్రతీ సందర్భంలోనూ తల్లిదండ్రుల పేర్లు చెబుతా
  • మహారాష్ట్రలో అదే నేరంగా ఉన్నట్టుందని ఎద్దేవా
  • తల్లిదండ్రుల పేర్లు చెప్పని వారు జీవించడానికే అనర్హులన్న సీఎం
ప్రమాణ స్వీకారం సమయంలో తల్లిదండ్రుల పేర్లు చెప్పడాన్ని తప్పుబట్టిన మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఘాటుగా సమాధానం చెప్పారు. తాను ప్రతీ సందర్భంలోనూ తన తల్లిదండ్రుల పేర్లు, ఛత్రపతి శివాజీ పేరును ప్రస్తావిస్తానని తేల్చి చెప్పారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోనివారు జీవించడానికే అనర్హులన్నారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడం మహారాష్ట్రలో నేరంగా ఉన్నట్టుందని ఉద్ధవ్ ఎద్దేవా చేశారు.

కాగా, గురువారం ఉద్ధవ్ చేసిన ప్రమాణ స్వీకారం నిర్దేశిత ఫార్మాట్‌లో లేదని, తండ్రి బాలాసాహెబ్ పేరును ప్రమాణ స్వీకారం సమయంలో ప్రస్తావించడం సరికాదని ఫడ్నవీస్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఉద్ధవ్ పై విధంగా బదులిచ్చారు.
Maharashtra
devendra fadnavis
Uddhav Thakeray

More Telugu News