బీజేపీని ఓడించాలంటే నితీశ్‌కు ఉన్న మార్గం అదొక్కటే: ఆర్జేడీ సీనియర్ నేత

షార్ట్స్‌లో చూడండి
బీహార్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీలు మళ్లీ చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆర్జేడీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది బీహార్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే మహారాష్ట్ర లాంటి పరిస్థితులు తీసుకురావాల్సి ఉంటుందన్నారు.

ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కనుక భావిస్తే ఆయన ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని, అంతకు తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించేందుకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇది మాత్రమేనని అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ కలిస్తే బీహార్‌లో ఎన్డీయే ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. జేడీయూతో పొత్తుకు తమకేమీ అభ్యంతరం లేదన్న రఘువంశ్ ప్రసాద్.. ఈ విషయంలో ఇప్పటి వరకు నితీశ్ కుమార్‌తో ఎటువంటి చర్చలు జరపలేదన్నారు.
Go Back to Shorts
BJP
bihar
NDA
RJD
Nitish kumar
JDU

More Telugu News