Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై స్నేహితుడి అత్యాచారం!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై స్నేహితుడే అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయిన యువతి తన సోదరితో కలిసి నిజాంపేట, ఈశ్వర్ విలాస్ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. శనివారం ఆమె ఇంటికి వచ్చిన స్నేహితుడు  జాయల్ చంద్ (27).. యువతి ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించి అత్యాచారం చేసి పరారయ్యాడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన బాధిత యువతి సోదరి.. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను చూసి కంగారుపడింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఫోన్ చేసింది. వారొచ్చి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Nizampet
woman
rape

More Telugu News