Tirumala: తిరుమల కిటకిట... దర్శనానికి 24 గంటల సమయం!

షార్ట్స్‌లో చూడండి
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో వేచివున్నవారికి అన్న పానీయాలు అందిస్తున్నామని తెలిపారు. కాలినడక భక్తుల దివ్య దర్శనానికి 6 గంటల సమయం, ప్రత్యేక, టైమ్ స్లాట్ భక్తుల దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. శనివారం నాడు స్వామివారిని 80 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, రూ. 3 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించింది.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD

More Telugu News