Disha: ప్రియాంక రెడ్డి కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరుగుతుంది: తమిళిసై

  • శంషాబాద్ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి
  • దర్యాప్తు వేగంగా జరుగుతుందన్న గవర్నర్
  • వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాలని పిలుపు
శంషాబాద్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రియాంక రెడ్డి కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరుగుతుందని వెల్లడించారు. వ్యవస్థలో లోపాలుంటే గుర్తించి సరిదిద్దాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతకుముందు తమిళిసై ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన సానుభూతి తెలిపారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
Disha
Telangana
Hyderabad
Governor
Tamalisai

More Telugu News