Chandrababu: జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ సీఎంపై జరిగిన దాడి ఇది... సమగ్ర విచారణ జరగాలి: కళా వెంకట్రావు డిమాండ్

  • చంద్రబాబు అమరావతి పర్యటనలో ఉద్రిక్తతలు
  • బాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు
  • హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసిన కళా వెంకట్రావు
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులతో నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. పోలీసులే నిరసనలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాడి జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎంపై జరిగిందని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కళా వెంకట్రావు లేఖ రాశారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam
Amaravathi
Kala Venkatrao
YSRCP

More Telugu News