Disha: చర్లపల్లి జైలు వద్ద కూడా అదే సీన్... ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆగ్రహజ్వాలలు!

  • ప్రియాంక రెడ్డి ఘటనపై రగిలిపోతున్న ప్రజలు
  • చర్లపల్లి వద్ద ఆందోళనలు
  • ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జి
ప్రియాంక రెడ్డి ఘటన నిందితులను తమకు అప్పగిస్తే నరకం ఏంటో చూపిస్తామంటూ ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ నిందితుల వద్దకే మేజిస్ట్రేట్ రావడం, ఆయన రిమాండ్ విధించడం జరిగాయి. తాజాగా ఆ నలుగురు నిందితులను షాద్ నగర్ పీఎస్ నుంచి చర్లపల్లి తరలిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద కూడా భారీగా ఆందోళనకారులు చేరుకుని నినాదాలతో హోరెత్తించారు.

చర్లపల్లి కారాగారం వద్దకు వచ్చినవారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వారిని వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. ఆందోళనల నేపథ్యంలో జైలు వద్ద భద్రతను మరింత పెంచారు.
Disha
Telangana
Hyderabad
Charlapalli
Police

More Telugu News