India: దుకాణంలో దొంగతనం... డబ్బును వదిలేసి ఉల్లిగడ్డలు చోరీ!

  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • రూ.50 వేల విలువైన ఉల్లిగడ్డలు చోరీ
  • లబోదిబోమన్న దుకాణదారు
దేశంలో ఉల్లిగడ్డల కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే సరైన నిదర్శనం. విపణిలో కేజీ రూ.75 నుంచి రూ.100 వరకు ధర పలుకుతున్న ఉల్లిగడ్డలు సామాన్యుల కంట కన్నీళ్ల తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ లోని మిడ్నపూర్ జిల్లాలో ఓ దొంగతనం జరిగింది. రాత్రివేళ షాపుకు తాళం వేసిన దుకాణదారు అక్షయ్ దాస్ మరునాడు షాపు తెరిచి లబోదిబోమన్నాడు.

గల్లాపెట్టెలో డబ్బు భద్రంగానే ఉంది కానీ, రూ.50 వేల విలువైన ఉల్లిగడ్డల బస్తాలు మాయం అయ్యాయి. ప్రస్తుతం బెంగాల్ మార్కెట్లో ఉల్లిధర రూ.100కి పైగా పలుకుతోంది. డిమాండ్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకుందామనుకున్న అక్షయ్ దాస్ ఆశలను దొంగలు అడియాసలు చేశారు.
India
Onions
Robbery
Shop
Price

More Telugu News