Udhav Thackeray: తల్లిదండ్రులు, శివాజీ పేరుతో ప్రమాణం చేశా, అది తప్పంటే మళ్లీ చేస్తా: ఉద్ధవ్ థాకరే

  • మహారాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ
  • విజయం సాధించిన ఉద్ధవ్ సర్కారు
  • అందరికీ కృతజ్ఞతలు చెప్పిన మహా సీఎం
మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. అసెంబ్లీలో బల నిరూపణ ప్రక్రియ నిర్వహించగా ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి బలం నిరూపించుకుంది. అనంతరం సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, బల పరీక్షలో తమకు మద్ధతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాకుండా, తాను ప్రమాణస్వీకారం సందర్భంగా ఛత్రపతి శివాజీ, తన తల్లిదండ్రుల పేరుతో ప్రమాణం చేశానని, అది తప్పంటే మళ్లీ చేస్తానని స్పష్టం చేశారు.
Udhav Thackeray
Shivsena
Maharashtra
Congress
NCP

More Telugu News