Disha: షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కే వచ్చిన మేజిస్ట్రేట్

  • పీఎస్ ఎదుట భారీ సంఖ్యలో నిరసనకారులు
  • స్టేషన్ కే వచ్చిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్
  • రిమాండ్ కు తరలించే అవకాశం
ప్రియాంక హత్య కేసు నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. అయితే, ఏ కోర్టులోనే మాత్రం కాదు. పరిస్థితులు ఉద్రిక్తభరితంగా ఉండటంతో నిందితులను పీఎస్ నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్) పాండునాయక్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన ముందు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితులను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. మరోవైపు, పీఎస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను అక్కడి నుంచి బలవంతంగా పంపించివేసేందుకు పోలీసులు యత్నించారు.
Disha
Murder
Magistrate

More Telugu News