Nara Lokesh: లక్షల మంది పేదలకు పోషక విలువలతో కూడిన ఐదు రూపాయల భోజనాన్ని దూరం చేశాడు: జగన్ పై లోకేశ్ విమర్శలు

  • ఆరు నెలల జగన్ పాలనపై లోకేశ్ స్పందన
  • సీఎం జగన్ కు 100కు సున్నా మార్కులు వేసిన లోకేశ్
  • అన్న క్యాంటీన్లు మూసివేశాడంటూ ఆగ్రహం
ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. జగన్ పరిపాలనకు 100కు సున్నా మార్కులు వేశారు. అంతేకాకుండా, ఆపేశాడు, మూసేశాడు, రద్దు చేశాడు, కూల్చేశాడు, వెనక్కు పంపేశాడు, చేతులెత్తేశాడు, తాకట్టు పెట్టాడు, ముంచేశాడు, మాయ చేశాడు అంటూ అంశాల వారీగా విమర్శలు వర్షం కురిపించారు.

ఇందులో 'మూసేశాడు' అనే అంశంపై వ్యాఖ్యానిస్తూ, నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆహార భద్రతనిస్తున్న అన్న క్యాంటీన్లను వైఎస్ జగన్ మూసివేశాడని మండిపడ్డారు. తద్వారా లక్షల మంది పేదలకు ఐదు రూపాయలకే పోషక విలువలతో కూడిన భోజనాన్ని పొందే అవకాశాన్ని దూరం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News