Balakrishna: రేపు పలకరించనున్న 'రూలర్' లిరికల్ సాంగ్

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ కథానాయకుడిగా 'జై సింహా' సినిమా చేసి మాస్ ఆడియన్స్ ను అలరించిన కేఎస్ రవికుమార్, చాలా తక్కువ గ్యాప్ లోనే బాలకృష్ణతో 'రూలర్' చేశాడు. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'అడుగడుగో యాక్షన్ హీరో' అనే ఫస్టు లిరికల్ వీడియో సాంగును రేపు ఉదయం 11:42 నిమిషాలకి విడుదల చేయనున్నారు. రెండు విభిన్నమైన లుక్స్ తో బాలకృష్ణ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదిక నటించారు. ప్రకాశ్ రాజ్ .. భూమిక ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలకృష్ణ అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Balakrishna
Chauhan
Vedika
Bhumika

More Telugu News