Disha: కామాంధులకు దుబాయ్ లో వేసే శిక్షలను అమలు చేయాలి: రోజా

  • ఆడపిల్లపై చేయి వేయాలంటేనే భయం కలిగేలా శిక్షలు ఉండాలి
  • నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి
  • ప్రియాంక హత్య నన్ను కలచి వేసింది
ప్రియాంకరెడ్డి హత్యపై వైసీపీ నాయకురాలు రోజా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు. ఈ కేసులోని నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడపిల్లపై చేయి వేయాలంటే భయం కలిగేలా శిక్షలు ఉండాలని అన్నారు. కామాంధులకు దుబాయ్ లో వేసే శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు, ఈ కేసులో నిందితులను కాసేపట్లో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు.

Disha
Murder
Roja
YSRCP

More Telugu News