Crime News: అందరూ సహకరించాలని కోరుతున్నాను: ప్రియాంక రెడ్డి హత్య కేసుపై డీసీపీ ప్రకాశ్ రెడ్డి

  • ప్రజలెవరూ అధైర్యపడొద్దని వినతి 
  • చట్టానికి లోబడి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య
  • కాసేపట్లో నిందితులను విచారణకు తరలించనున్న పోలీసులు
ప్రియాంక రెడ్డి హత్య ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు షాద్ నగర్, శంషాబాదుల్లో ర్యాలీలు నిర్వహిస్తుండడంతో నిందితులను విచారణ నిమిత్తం కోర్టుకు తరలించే విషయం పోలీసులకు సవాలుగా మారింది. హత్యాచార ఘటనతో ఆడపిల్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు.

దీనిపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పందించారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని కోరుతున్నామని మీడియాకు చెప్పారు. ప్రియాంక రెడ్డి కేసు విషయంలో తాము విచారణ పూర్తి చేసే విషయంలో అందరూ సహకరించాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు. చట్టానికి లోబడి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
Crime News
Police
Hyderabad

More Telugu News