Hyderabad: 'ప్రియాంక రెడ్డి' ఘటనపై ఆగ్రహావేశాలు.. నిందితులను బయటకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేని వైనం.. వైద్యులనే నిందితుల వద్దకు పిలిపించిన పోలీసులు

  • శంషాబాద్, షాద్ నగర్ ప్రాంతం అంతా జన సంద్రం
  • నిందితులను కాసేపట్లో కోర్టుకు
  • పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు 
వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతోన్న విషయం తెలిసిందే. భారీ ర్యాలీలు, ఆందోళనలతో శంషాబాద్, షాద్ నగర్ ప్రాంతం అంతా జన సముద్రాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం నిందితులు ఉన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు నిరసనకు దిగి, నిందితులను తమకు అప్పగించాలని, వారి అంతు చూస్తామని నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

నిందితులను కోర్టుకు తరలించే ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీంతో వారిని షాద్ నగర్ ఆసుపత్రికి తరలిద్దామని పోలీసులు భావించారు. అయితే, వారిని బయటకు తీసుకెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వైద్యులనే ఆసుపత్రికి పిలిపించారు. పోలీస్ స్టేషన్ లోనే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
Hyderabad
Crime News
Police

More Telugu News