Sai Dharam tej: 'ప్రతిరోజూ పండగే' నుంచి మరో లిరికల్ వీడియో
- ఈ రోజున రాశి ఖన్నా పుట్టినరోజు
- సందర్భానికి తగిన సాంగ్ ను వదిలిన టీమ్
- డిసెంబర్ 20న సినిమా విడుదల
సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా 'ప్రతిరోజూ పండగే' సినిమా నిర్మితమైంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజున రాశి ఖన్నా పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు.
'తకిట తకిట తకిట తకిట కొట్టర డీజే .. తకిట తకిట తకిట తకిట పుట్టినరోజే' అనే పాటను వదిలారు. సినిమా ప్రమోషన్ గానే కాకుండా, రాశి ఖన్నా బర్త్ డే కానుకగా సందర్భానికి తగిన పాటను విడుదల చేశారనే అనుకోవాలి. తమన్ అందించిన సంగీతం .. కాసర్ల శ్యామ్ సాహిత్యం .. గీతామాధురి - రాహుల్ సిప్లిగంజ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. జోరుగా .. హుషారుగా సాగే ఈ పాట యూత్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తుందని చెప్పొచ్చు. మారుతి నుంచి రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.