KCR: కేసీఆర్ నివాసం వద్ద కలకలం.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన భార్యా బాధితుడు

  • తాపీ మేస్త్రీగా పని చేస్తున్న అచ్చయ్య
  • భార్య నిత్యం తిడుతూ, వేధిస్తోందని ఆవేదన
  • ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ వద్ద కలకలం చోటు చేసుకుంది. తన భార్య నిత్యం తనతో గొడవపడుతోందని, ఆమె వేధింపులను భరించలేకపోతున్నానంటూ ఓ భార్యా బాధితులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతనిపై నీళ్లు గుమ్మరించి, నిలువరించారు.

ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి పేరు అచ్చయ్య. 35 ఏళ్ల అచ్చయ్య తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. సోమాజిగూడలో మంజీరా గెస్ట్ హౌస్ కు సమీపంలో నివాసం ఉంటున్నాడు. తనకు ఆరుగురు సంతానమని, వారిని పోషించడం కష్టంగా ఉందని పోలీసుల విచారణలో అచ్చయ్య తెలిపాడు. దీనికి తోడు తన భార్య మరియమ్మ నిత్యం తనను తిడుతూ, వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వీటన్నింటిని భరించలేక, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. అనంతరం అచ్చయ్య భార్యను తీసుకొచ్చిన పోలీసులు... భార్యాభర్తలిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి, పంపించేశారు.
KCR
Pragathi Bhawan
Suicide Attempt

More Telugu News