Buddhavenkanna: జగన్ పాలన ఎంత చెండాలంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు: బుద్ధా వెంకన్న

  • 6 నెలల్లో 250 మంది రైతుల ఆత్మహత్యలు
  • 50 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు 
  • డెంగ్యూ, మలేరియాతో వందల మరణాలు 
ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు కేవలం ఆరు నెలల్లో సీఎం జగన్ పరిష్కారం చూపారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

'6 నెలల్లో 250 మంది రైతుల ఆత్మహత్యలు, 50 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇద్దరు ఉద్యోగస్తుల ఆత్మహత్యలు, నలుగురు టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మహత్యలు, డెంగ్యూ, మలేరియాతో వందల మరణాలు. జగన్ గారి పరిపాలన ఎంత చెండాలంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదనుకుంటున్నాను' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
Buddhavenkanna
Telugudesam
YSRCP

More Telugu News