Maharashtra: బలపరీక్షకు సిద్ధమైన ఉద్ధవ్ థాకరే.. నేటి మధ్యాహ్నమే ముహూర్తం!

  • నిన్న అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్
  • స్పీకర్ పదవికి నేడు ఎన్నిక
  • తాము తీసుకోబోమన్న ఎన్సీపీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నేటి మధ్యాహ్నం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ మేరకు విధానసభ అధికారులు తెలిపారు. మొన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ నిన్న అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.  మరోవైపు, ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకుని స్పీకర్ పదవిని వదిలిపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు వస్తున్న వార్తలపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి ఇచ్చేందుకు మూడు పార్టీల మధ్య  ఒప్పందం జరిగినట్టు తెలిపారు. స్పీకర్ పదవిని తాము తీసుకోబోమన్నారు. కాగా, స్పీకర్ పదవికి నేడు ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Maharashtra
shivsena
uddhav thackeray

More Telugu News