Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డిజిటల్ ప్రపంచంలోకి తమన్నా!
  • 'ఇద్దరి లోకం ఒకటే' సెన్సార్ పూర్తి 
  • వ్యాపారంలోకి దిగిన అదితీరావు
   *  మిల్కీ బ్యూటీ తమన్నా కూడా డిజిటల్ వరల్డ్ లోకి ప్రవేశిస్తోంది. హాట్ స్టార్ లో ప్రసారం కోసం ఉద్దేశించిన 'నవంబర్ స్టోరీ' అనే వెబ్ సీరీస్ లో తమన్నా నటించనుంది. ఇప్పటికే కాజల్, సమంత వెబ్ సీరీస్ లో నటిస్తున్న సంగతి విదితమే.  
*  రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ను ఇచ్చింది. శాలినీ పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నారు.
*  అందాల కథానాయిక అదితీరావు హైదరి వ్యాపారంలోకి కూడా దిగింది. త్వరలో చెన్నైలో జరగనున్న టెన్నిస్ లీగ్ లో పాల్గొనే 'చెన్నై స్టాలియన్స్' జట్టుకి ఆమె పెట్టుబడి పెట్టింది. తన తండ్రి టెన్నిస్ ప్లేయర్ అనీ, తనని కూడా టెన్నిస్ ప్లేయర్ చేయాలని ఆయన కలలు కన్నారనీ, అందుకే ఆ జట్టు యాజమాన్యంలో భాగస్వామినయ్యానని పేర్కొంది.
Thamanna
Kajal Agarwal
Samantha
Rajtarun

More Telugu News