Buggana: మంత్రి బుగ్గన అభివృద్ధి చూడలేకపోతున్నారు... అందుకే ఆయనకు కళ్లజోడు పంపుతున్నాం: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

  • ఆర్థికమంత్రి బుగ్గనపై దీపక్ రెడ్డి విమర్శలు
  • అమరావతిలో ఏమీ లేదనడం విడ్డూరంగా ఉందన్న దీపక్ రెడ్డి
  • గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ధ్వజమెత్తారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, రాజధానిలో జరిగిన అభివృద్ధి మంత్రి బుగ్గనకు కనిపించడంలేదని, అందుకే ఆయనకు కొత్త కళ్లజోడు పంపుతున్నామని తెలిపారు. అమరావతిలో రూ.5000 కోట్లతో అనేక నిర్మాణాలు జరిగితే బుగ్గన మాత్రం ఏమీ చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో అసలు ఏమీ లేదని ఆర్థికమంత్రి అనడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి కొత్త కళ్లద్దాల సెట్ ను మీడియాకు ప్రదర్శించారు. అంతేకాదు, అమరావతిలో నిర్మాణం జరుపుకుంటున్న అనేక భవనాలకు సంబంధించిన వీడియోలను కూడా ప్రదర్శించారు.
Buggana
Deepak Reddy
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News