Disha: ‘మాట్లాడు పాప నాకు భయమైతుంది.. ఏడుపొస్తోంది’.. తన సోదరితో ప్రియాంకరెడ్డి చివరి మాటలు!

షార్ట్స్‌లో చూడండి
డాక్టరు ప్రియాంకరెడ్డిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆపై ఆమెను హతమార్చిన విషయం తెలిసిందే. నిందితులు ఓ పథకం ప్రకారం టోల్ ప్లాజా దగ్గర ఆమె స్కూటీని పంక్చర్ చేసి, సాయం చేస్తామని నమ్మబలికి ఆ వాహనాన్ని తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రియాంకరెడ్డి తన సోదరి భవ్యరెడ్డితో ఫోన్ లో దాదాపు ఆరు నిమిషాల సమయం మాట్లాడిన మాటలే ఆమె చివరి మాటలు.

ఇక్కడ ఒక లారీ ఉందని, అందులో నుంచి ఒక పిల్లాడు వచ్చి తన స్కూటీకి పంక్చర్ వేయిస్తానని చెప్పి తీసుకెళ్లాడని, అయితే, పంక్చర్ వేసే షాప్ మూసేశారని చెప్పాడని, ఇంకో షాప్ కు వెళతానని అన్నాడని ప్రియాంకరెడ్డి తన సోదరికి చెప్పింది. ‘భయమయతాంది పాప నాకు..’ అంటూ తన సోదరికి ప్రియాంకరెడ్డి చెప్పింది.

‘మాట్లాడు పాప నాకు భయమయితుంది.. ఇక్కడ నాకు చాలా భయమయితుంది.. ఏడుపొస్తోంది’, ‘చాలా భయమయితుంది వాళ్లను చూస్తుంటే’, ‘ఇక్కడ నాకు అస్సలు నిలబడాలనే లేదు..’ అని ప్రియాంక అంటుంటే, ‘టోల్ బూత్ దగ్గరకు వెళ్లి నిలబడు’ అని ఆమె సోదరి చెప్పింది. ‘అక్కడ నిలబడితే వచ్చేటోళ్లు, పోయేటోళ్లు అందరూ చూసుకుంటూపోతారు’ అని ప్రియాంక బదులివ్వడం ఆ ఫోన్ సంభాషణలో వుంది.
Go Back to Shorts
Disha
Veternary Doctor

More Telugu News