Chandrababu: రాజధాని అంశంపై వచ్చే నెల 5న రౌండ్ టేబుల్ సమావేశం.. చంద్రబాబు నిర్ణయం

  • టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు
  • రాజకీయపార్టీలు, నిపుణులు, ఉద్యోగ, ప్రజాసంఘాలతో ఈ సమావేశం
  • బస్సుపై దాడి అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించమన్న బాబు 
టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడలో సమావేశమయ్యారు. రాజధాని అభివృద్ధి అంశంపై వచ్చే నెల 5న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాజకీయ పార్టీలు, నిపుణులు, ఉద్యోగ, ప్రజాసంఘాలతో ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతిపై గత ప్రభుత్వ నిర్ణయాలు, నేటి ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు. డీజీపీ వ్యాఖ్యలపై కేంద్ర హోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని, బస్సుపై దాడి అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం.
Chandrababu
Telugudesam
Amaravathi
Vijayawada

More Telugu News