Chandrababu: వైసీపీ దాడులు చేస్తోందని చంద్రబాబు ఎదుట వాపోయిన టీడీపీ కార్యకర్తలు

  • చంద్రబాబును కలిసిన రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలు
  • వైసీపీ అరాచకాలకు లెక్కలేకుండా పోయిందని ఫిర్యాదు
  • మంత్రి మోపిదేవి కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయంటూ, గుంటూరు జిల్లా ముట్లూరు టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేత నారా లోకేశ్ ను ఇటీవల కలిసి తమ బాధను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఇదే జిల్లాకు చెందిన రేపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ఇదే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని కలిశారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల అరాచకాలకు లెక్కలేకుండా పోయిందని ఆయనకు చెప్పారు. వాన్ పిక్ భూముల కుంభకోణం విషయమై పోరాడినందుకు తమపై కక్ష కట్టారని, మంత్రి మోపిదేవి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
Chandrababu
YSRCP
Minister
Mopodevi

More Telugu News