Chandrababu: చంద్రబాబుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత డీజీపీకి లేదా?: వర్ల రామయ్య

  • చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులు వేయిస్తారా?
  • దీనిపై ఆరుగురు అడిషినల్ డీజీలు సమాధానం చెప్పాలి
  • శాంతిభద్రతలు కాపాడటంలో డీజీపీ విఫలమయ్యారు
నిన్న చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడి ఘటనను టీడీపీ నేత వర్ల రామయ్య ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనపై ఆరుగురు అడిషినల్ డీజీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత డీజీపీకి లేదా? అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడటంలో డీజీపీ విఫలమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనపై నిరసనకు అనుమతిస్తామని చెప్పి.. రాళ్లు, చెప్పులు వేయిస్తారా? అని ప్రశ్నించారు. రేపు ఢిల్లీ  వెళ్లి డీజీపీ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్న తీరు, ఆయన ఉపయోగిస్తున్న భాషపై ఆయన విమర్శలు గుప్పించారు. నాని నోరు తెరిస్తే బూతులు తప్ప మరోటి మాట్లాడడని, కనీస సభ్యతసంస్కారాలు లేని వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై దుర్భాషలాడాడని మండిపడ్డ వర్ల, తమ మంత్రులు బూతులు మాట్లాడుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Chandrababu
Telugudesam
varla ramaiah
Dgp

More Telugu News