Disha: సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా?: ప్రియాంకరెడ్డి హత్యాచారంపై అనుష్క     

  • ప్రియాంక రెడ్డి హత్య దిగ్భ్రాంతిని కలిగించింది
  • ఇది మానవాళిని కదిలించే ఘటన
  • దుండగులకు శిక్ష పడేలా కలిసి పోరాడుదాం
డాక్టర్ ప్రియాంక రెడ్డిని దారుణంగా హతమార్చిన ఘటనపై సినీ నటి అనుష్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే... అవి కూడా సిగ్గుపడతాయని అన్నారు. అమాయకురాలైన ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి చంపేశారని... ఇది మొత్తం మానవాళిని కదిలించే విషాదకరమైన ఘటన అని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదామని అన్నారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.
Disha
Anushka Shetty
Tollywood

More Telugu News