Mohena Kumari Singh: ఆ రాజవంశంలో వందేళ్ల తర్వాత ఓ యువరాణికి పెళ్లయింది... హాజరైన మోదీ

  • పెళ్లి చేసుకున్న టీవీ నటి మోహన కుమారి సింగ్
  • విందుకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన ప్రధాని మోదీ
  • టీవీ సీరియల్ నటిగా మోహనకు గుర్తింపు
సాధారణంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు వివాహ కార్యక్రమాలకు హాజరు కావడం అత్యంత అరుదు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఓ పెళ్లివేడుకకు హాజరై  వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి ఆయన వచ్చింది వధువు ఆహ్వానంపై. వధువు ఓ టీవీ నటి. ఆమె పేరు మోహన కుమారి సింగ్. ఓ టీవీ నటి పెళ్లికి ప్రధాని హాజరు కావడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. మోహన కుమారి సింగ్ వాస్తవానికి ఓ రాజ కుటుంబీకురాలు.

మధ్యప్రదేశ్ లోని రేవా రాజ వంశంలో ఆమె ఓ యువరాణి. సుయేష్ రావత్ తో ఆమె వివాహం అత్యంత ఘనంగా జరిగింది.  ఆ రాజవంశంలో వందేళ్ల తర్వాత ఓ యువరాణి పెళ్లి జరగడంతో, ఢిల్లీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు. దాంతో, ఆయన విందుకు విచ్చేసి మోహన, సుయేష్ లను దీవించారు. వారితో సెల్ఫీలు దిగారు. మోహన రాజకుటుంబానికి చెందిన యువతి అయినా, ఆమె నటనపై మక్కువతో అనేక హిందీ సీరియళ్లలో నటిస్తున్నారు.
Mohena Kumari Singh
Narendra Modi
TV
Actress

More Telugu News