Keiron Pollard: భారత పర్యటనలో పొలార్డ్ కెప్టెన్ గా విండీస్ టి20, వన్డే జట్ల ఎంపిక

షార్ట్స్‌లో చూడండి
వచ్చే నెల 6 నుంచి వెస్టిండీస్ జట్టు భారత్ లో టి20, వన్డే సిరీస్ లు ఆడనుంది. డిసెంబరు మాసంలో టీమిండియా, విండీస్ మధ్య 3 టి20లు, 3 వన్డేలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడు కీరన్ పొలార్డ్ ను రెండు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా ఎంపిక చేశారు. టి20, వన్డేలకు విడివిడిగా ప్రకటించిన జట్లలో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశారు.

విండీస్ టి20 జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, లెండిల్ సిమ్మన్స్, ఫాబియన్ అలెన్, షిమ్రోన్ హెట్మెయర్, నికోలాస్ పూరన్, జాసన్ హోల్డర్, బ్రాండన్ కింగ్, కెస్రిక్ విలియమ్స్, రూథర్ ఫర్డ్, కీమో పాల్, షెల్డన్ కాట్రెల్, హెడెన్ వాల్ష్ జూనియర్, దినేశ్ రామ్ దిన్, కారీ పియర్రీ.

విండీస్ వన్డే జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, సునీల్ ఆంబ్రిస్, షిమ్రోన్ హెట్మెయర్, నికొలాస్ పూరన్, బ్రాండన్ కింగ్, కీమో పాల్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, హెడెన్ వాల్ష్ జూనియర్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, కారీ పియర్రీ, షెల్డన్ కాట్రెల్.

Go Back to Shorts
Keiron Pollard
West Indies
India
Cricket

More Telugu News