Ladies: 122 కార్లలో తిరుగుతున్నాం... 8 నిమిషాల్లో వచ్చేస్తాం: ఆపదలో ఉన్నవారికి అంజనీకుమార్ అభయం

  • ఆపద అనిపిస్తే 100కు డయల్ చేయండి
  • ఆరు నుంచి ఎనిమిది నిమిషాల్లో వచ్చేస్తాం
  • పోలీసులు ఉన్నది ప్రజల కోసమే
ఎవరైనా ఆపదలో ఉన్నామని భావిస్తే, వెంటనే పోలీసుల సాయం తీసుకోవాలని ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ సూచించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, అభద్రతాభావం కలిగితే 100కు డయల్ చేయాలని సూచించారు. పోలీస్ పెట్రోల్ కారు ఆరు నుంచి ఎనిమిది నిమిషాల్లోనే మీ ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూ ఉంటాయని తెలిపారు. వెంటనే సాయం చేసేందుకు వస్తాయని తెలిపారు. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని తెలిపారు.
Ladies
Anjani Kumar
Twitter

More Telugu News