Chandrababu: అమరావతి యాత్రలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు: విజయసాయి రెడ్డి

  • కార్యకర్తలు అంతా పెయిడ్ ఆర్టిస్టులయ్యారని బాబు అన్నారు 
  • ఓ వీడియోలో ఇది క్లియర్‌గా కనిపిస్తోంది
  • ఆ వీడియో వైరల్ అయింది
  • బతుకంతా డబ్బుతో మేనేజ్ చేయడమే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 'రాజధాని అమరావతి పర్యటన'లో చోటు చేసుకున్న విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఆయనకు ఎవరి మీదా గౌరవం, అభిమానాలు ఉండవని అన్నారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు.

'అమరావతి యాత్రలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అందరికీ టిఫిన్లు పెట్టారా? అని నిర్వాహకుడిని అడిగితే డబ్బులిచ్చాం అని బదులిచ్చాడు. అంతా పెయిడ్ ఆర్టిస్టులయ్యారని బాబు అనడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది. ఆ వీడియో వైరల్ అయింది. బతుకంతా డబ్బుతో మేనేజ్ చేయడమే' అని విజయసాయి రెడ్డి అన్నారు.

పార్టీ కార్యకర్తలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఇంకోసారి ఆ వీడియో సాక్షిగా బయటపడిందని విజయసాయి రెడ్డి అన్నారు. కార్యకర్తలకు డబ్బు, మద్యం అలవాటు చేసిందే ఆయనని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులుగా మారారని అధికారం కోల్పోయాక తల బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎవరి మీదా గౌరవం, అభిమానాలు ఉండవని ప్రేమ నటిస్తాడని చెప్పారు.

Chandrababu
Vijay Sai Reddy
Andhra Pradesh

More Telugu News