TelanganaCMO: నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలి: ప్రియాంకారెడ్డి ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్

  • ఆమెను సజీవ దహనం చేసిన ఘటన గురించి చదివి బాధపడ్డాను
  • ఒకింత ఆగ్రహానికి గురయ్యాను 
  • ప్రియాంకారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను 
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వద్ద హత్యకు గురైన పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. 'హైదరాబాద్ శివారులో యువ వైద్యురాలిపై అత్యాచారం జరిపి సజీవ దహనం చేసిన ఘటన గురించి చదివి బాధపడ్డాను.. ఒకింత ఆగ్రహానికి గురయ్యాను. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి కార్యాలయం, తెలంగాణ డీజీపీని కోరుతున్నాను. ఈ బాధాకర సమయంలో ప్రియాంకారెడ్డి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను. ప్రియాంకారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
TelanganaCMO
raja singh
Hyderabad

More Telugu News