Andhra Pradesh: ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి ఇంటి అద్దె రూ. లక్ష.. మంజూరు చేసిన ప్రభుత్వం

  • క్యాంపు కార్యాలయ అలవెన్సులుగా మరో రూ. 5 వేలు
  • గురువారం ఉత్తర్వులు జారీ
  • విజయవాడలోని వివేకానంద కాలనీలో అద్దెకు ఉంటున్న మంత్రి
అతి పిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో చోటు దక్కించుకుని రికార్డు సృష్టించిన గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఇంటి అద్దెను ప్రభుత్వం గురువారం మంజూరు చేసింది. మంత్రి అయిన తర్వాత పుష్పశ్రీవాణి విజయవాడలోని వివేకానంద కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆ ఇంటికి నెలకు లక్ష రూపాయల అద్దె కాగా, క్యాంపు కార్యాలయ అలవెన్సుగా మరో రూ. 5 వేలను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి వివాహం తర్వాత విజయనగరం జిల్లా జియమ్మవలస మండలంలోని చినమేరంగి కోటలో స్థిరపడ్డారు.
Andhra Pradesh
minister pushpa srivani
rent

More Telugu News