Rajashekar: సినీ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేసిన పోలీసులు!

  • ఇటీవల ఓఆర్ఆర్ పై ప్రమాదం
  • వాహనాన్ని స్వయంగా నడిపిన రాజశేఖర్
  • లైసెన్స్ రద్దుకు సైబరాబాద్ పోలీసుల సిఫార్సు
ఇటీవల సినీ హీరో రాజశేఖర్, తన వాహనాన్ని స్వయంగా నడుపుతూ, రోడ్డు ప్రమాదానికి గురైన నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయాలని ఆర్టీయే అధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీయేకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ లేఖను పంపారు. ఆయన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని, ఓఆర్ఆర్ పై ఇంత నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుందని వారు గుర్తు చేశారు. కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సిఫార్సులపై ఆర్టీయే అధికారులు నిర్ణయం తీసుకోవాల్సివుంది. కనీసం ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Rajashekar
Driving Licence
Cancel
Recomandation
RTA

More Telugu News