Karem Sivaji: నేడు జగన్ సమక్షంలో వైసీపీలోకి కారెం శివాజీ!

  • నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ పదవికి రాజీనామా
  • నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు వైసీపీలో చేరిక
  • మరో 8 మందితో కలిసి జగన్ వద్దకు
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ, నేడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఓ కార్యక్రమంలో శివాజీతో పాటు 9 మంది వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరందరికీ సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

కాగా, కారెం శివాజీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పొందిన..  ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి గురువారం నాడు రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్ తో పాటు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి ఆయన వేరువేరుగా లేఖలు పంపారు. పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం.
Karem Sivaji
SC ST Commission
YSRCP

More Telugu News