Somu Veerraju: అధికార, విపక్ష నేతలు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉంది: సోము వీర్రాజు

  • నేతల భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సోము వీర్రాజు
  • స్పీకర్ సైతం అలాగే మాట్లాడుతున్నారు 
  • నైతిక విలువల కమిటీ భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామన్న బీజేపీ నేత
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అధికార, విపక్ష సభ్యులు స్పందిస్తున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నేతలు మాట్లాడుతున్న భాష సరిగాలేదని అన్నారు. త్వరలో జరిగే శాసనసభ నైతిక విలువల కమిటీ భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. ఆఖరికి ఉన్నత విలువలు కలిగిన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి సైతం ఇలాంటి భాషే ఉపయోగించడం పట్ల విచారిస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లాలో ఇవాళ జరిగిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Somu Veerraju
BJP
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News