Maharashtra: మహారాష్ట్ర నూతన సీఎం ఉద్ధవ్ థాకరేకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

  • మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం
  • ట్విట్టర్ లో స్పందించిన ప్రధాని మోదీ
  • మహారాష్ట్రను మెరుగైన భవిష్యత్ దిశగా నడిపించాలని ఆకాంక్ష
మహారాష్ట్రలో అనేక వారాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కొత్త సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే (59) ఈ సాయంకాలం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహారాష్ట్ర భవిష్యత్తును బంగారమయం చేయడంలో ఉద్ధవ్ థాకరే ఎంతో జాగరూకతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు.

మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. సీఎం పీఠం బీజేపీకి అందినట్టే అంది చేజారిపోయింది. బలనిరూపణకు ముందే సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో మూడు పార్టీల కూటమికి మార్గం సుగమం అయింది.
Maharashtra
Shivsena
Congress
NCP
BJP
Udhav Thackeray
Narendra Modi

More Telugu News