Rajasthan: పని చేయాల్సిన చోట నాగినీ డ్యాన్సులు... టీచర్లపై వేటు!

  • రాజస్థాన్ లో ఘటన
  • ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం
  • విరామంలో నాగినీ డ్యాన్స్ తో రెచ్చిపోయిన టీచర్లు
రాజస్థాన్ లోని కొందరు టీచర్లు తమ విధులను పక్కనబెట్టి నాగినీ డ్యాన్సులతో రెచ్చిపోయారు. జలోర్ జిల్లాలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతుల్లో భాగంగా ఓ స్కూల్లో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్ క్లాసులకు హాజరైన టీచర్లు బ్రేక్ సమయంలో తమలోని కళను బయటపెట్టారు! ఓ లేడీ టీచర్ నాగినీలా ఊగిపోతూ డ్యాన్స్ మొదలుపెట్టగా, ఆమెకు మరో ఉపాధ్యాయుడు జతకలిశాడు. అతడు పాములోడు మాదిరిగా బూర ఊదుతున్నట్టు నటించగా, ఆమె నాగకన్యలా యాక్ట్ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆ లేడీ టీచర్ ను, ఆమెతో కలిసి పాము డ్యాన్స్ చేసిన మరో ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. వారిని ఎంకరేజ్ చేసిన మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Rajasthan
Teachers
Nagin
Dance
Jalore

More Telugu News