RRR: ఆర్ఆర్ఆర్ చిత్రం తాజా సమాచారం... అలియాపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసిన రాజమౌళి

  • రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
  • రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్
  • 70 శాతం పూర్తయిన షూటింగ్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. అలియా పాత్ర ఇందులో చిన్నదే అయినా కథలో కీలకమైనది. ఆమెపై చివరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన తర్వాత రాజమౌళి సహా చిత్ర యూనిట్ సభ్యులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ 70 శాతం పూర్తయింది. త్వరలోనే ఎన్టీఆర్, ఒలీవియో మోరిస్ జోడీపై సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరించనున్నారు.
RRR
Rajamouli
Alia Bhatt
Tollywood
Jr Ntr
Ramcharan
Bollywood

More Telugu News