Chandrababu: చంద్రబాబు పర్యటనతో అమరావతి కాంక్ష మళ్లీ ఊపిరిపోసుకుంది: నారా లోకేశ్

  • చంద్రబాబు పర్యటనకు వచ్చిన ప్రజా స్పందనే నిదర్శనం
  • ఇంతటి స్పందన వస్తుందని తెలిసే వైసీపీ దాడులు చేయించింది
  • ఈ దాడులపై స్పందించిన డీజీపీ కొత్త నిర్వచనాలిచ్చారు
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు ఈరోజు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నారా లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు. ప్రజల్లో ప్రజా రాజధాని నిర్మాణ కాంక్ష బలంగా ఉందని చెప్పడానికి చంద్రబాబు అమరావతి పర్యటనకు వచ్చిన ప్రజా స్పందనే నిదర్శనమని అన్నారు. ఇంతటి స్పందన వస్తుందని తెలిసే వైసీపీ వాళ్లు, పెయిడ్ ఆర్టిస్టులను తెప్పించి చంద్రబాబు కాన్వాయ్ పై దాడులు చేయించారని ఆరోపించారు. ఈ దాడులపై స్పందించిన డీజీపీ.. భావ ప్రకటనా స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కులకు కొత్త నిర్వచనాలిచ్చారని విమర్శించారు. ఏది ఏమైనా చంద్రబాబు పర్యటనతో అమరావతి కాంక్ష మళ్లీ ఊపిరిపోసుకుందని అన్నారు.
Chandrababu
Nara Lokesh
Amaravathi
DGP

More Telugu News