Chandrababu: ఇది ఒక మతానికో, కులానికో సంబంధించిన రాజధాని కాదు: చంద్రబాబునాయుడు

  • భావితరాల భవిష్యత్తుకు ప్రతీక అమరావతి
  • రాజధాని నిర్మాణం కోసం నాడు సంకల్పించాను
  • నా హయాంలో జరిగిన పనులకు వైసీపీ వాళ్లు చెప్పే మాటలకు పొంతనే లేదు 
ఏపీ రాజధాని అమరావతి ఒక మతానికో, కులానికో సంబంధించినది కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి పర్యటనకు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి ఒక కాస్మోపాలిటన్ సిటీ అని, భావితరాల భవిష్యత్తుకు ప్రతీక అని చెప్పారు. నాడు రాజధాని నిర్మాణం కోసం తాను ఓ సంకల్పం చేశానని, నేడు దుర్మార్గమైన పాలనలో దీని నిర్మాణాన్ని నిలిపివేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధానికి సంబంధించి వైసీపీ నేతలు చెప్పిన విషయాలపై ఓసారి ఆలోచించాలని, తమ హయాంలో జరిగిన పనులకు, వైసీపీ వాళ్లు చెప్పిన మాటలకు పొంతనే లేదని, తన పాలనలో పనులు పెద్దఎత్తున జరిగాయని, కొన్ని బిల్డింగ్స్ తొంభై శాతం పూర్తయ్యాయని చెప్పారు.
Chandrababu
Telugudesam
YSRCP
amaravathi

More Telugu News