Sonia Gandhi: ఏ గవర్నరూ ఇలా వ్యవహరించలేదు: సోనియా గాంధీ

  • మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మూడు పార్టీల కూటమి
  • గవర్నర్ పాత్రను ప్రశ్నించిన సోనియా
  • మోదీ, అమిత్ షా కనుసన్నల్లోనే నడుచుకున్నారంటూ ఆరోపణలు
మహారాష్ట్రలో అనేక నాటకీయ మలుపులు తిరిగిన రాజకీయం చివరికి శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో సద్దుమణిగింది. అయితే, దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందిస్తూ, ఇప్పటివరకు జరిగిన పరిణామాల్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పాత్రను ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ ఓ గవర్నర్ ఇలా వ్యవహరించడం చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

"ఆయన (కోష్యారీ) ప్రధానమంత్రి, హోంమంత్రి అభీష్టాల మేరకే నడుచుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బాధ్యతాయుతమైన గవర్నర్ గా వ్యవహరించాల్సిన ఆయన ప్రవర్తన గర్హనీయం. మా కూటమిని దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి" అంటూ మండిపడ్డారు.
Sonia Gandhi
Congress
Maharashtra
BJP
Narendra Modi
Amit Shah

More Telugu News