Chandrababu: జగన్ పై నిందలేయాలని చంద్రబాబు,‘జనసేన’ చూస్తే పుట్టగతులుండవు: వైసీపీ నేత రోజా

  • చంద్రబాబు అమరావతిలో ఓ ఇల్లు కూడా కట్టుకోలేదు
  • ఇచ్చిన హామీలను జెట్ స్పీడ్ లో జగన్ అమలు చేస్తున్నారు
  • బురదజల్లాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటూ గెలవదు
అమరావతిలో కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబునాయుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ నేత రోజా అన్నారు. అమరావతిలో చంద్రబాబు పర్యటనపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంశాలపై చంద్రబాబు తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారని, దీంతో ఆయన ‘యూ’ టర్న్ తీసుకున్నారని, ఇప్పుడేమో అమరావతి పర్యటనకు వెళ్లారని విమర్శించారు.

జగన్ పై బురదజల్లాలని ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా టీడీపీ గెలవలేదని జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలను జెట్ స్పీడ్ లో అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ కు అందరూ ‘జేజేలు’ పలుకుతున్నారని ప్రశంసించారు. జగన్ పై నిందలు వేయాలని చంద్రబాబునాయుడు కానీ, జనసేన పార్టీ లేదా ఇంకెవరైనా చూస్తే కనుక వారికి పుట్టగతులుండవని రోజా హెచ్చరించారు. 
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Roja

More Telugu News