Tractors Theft: రైతుల ట్రాక్టర్లను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు
ప్రకాశం జిల్లాలో రైతుల ట్రాక్టర్లను దొంగిలించిన ఐదుగురు సభ్యులున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు. చోరీ చేసిన ట్రాక్టర్ల నెంబరు ప్లేట్లను మార్చి తిరిగి వాటిని విక్రయిస్తున్నారని తెలిపారు. అంతేకాక ట్రాక్టర్లను ముక్కలు చేసి పాత ఇనుము కింద విక్రయిస్తున్నారని వెల్లడించారు.